ఇతిశివం---------రావెలపురుషోత్తమరావు=========================================
తెలుగు సాహితీ నందనోద్యానవనములో అనేక సురభిళమైన కావ్య సుమాలను పూయించిన ఘనత శివకవులదేనని చెప్పుట నిర్వివాదాంశము.ఎన్నోసాహితీ ప్రక్రియలను ప్రవేశపెట్టి సాహితీమతల్లి వైభవమును దశ దిశలా చాటిన ఘనత వారిదే.ముఖ్యముగా శతక వాజ్మయమున తొలి పష్పమును పూయించి తరువాతికాలములో వేనవేలుగా శతకములు భక్తి రస ప్రబోధముగా వెలువడుటకు మార్గదర్శకులైరి. మకుటనియమము,సంఖ్యానియమము శ్రద్ధగా పాటించిన ఘనత వారిదే.
పాల్కురికి సోమనాధుని "వృషాధిప శతకము" తెలుగు నాటవెలిసిన తొలిశతకము.
బసవే శ్వరుని సంబోధించుచూ బసవా! బసవా!! వృషాధిపా!!! అన్న మకుటముతో 108 పద్యములతో వెలువరించిన ఘనతసోమనాధునిదే.
ఆతర్వాత శ్రీనాధుని రచనలు ముఖ్యముగాహర విలాసము, కాశీ ఖండము,.భీమ ఖండము,
శివరాత్రి మామాహాత్మ్యమూ ఎన్నదగినవి.శ్రీనాధునిదృష్టిలో శివపార్వతులు దేవతా స్వరూపం కన్న మిన్నగా వాగర్ధ ప్రతిపాదకములైన
తల్లిదండ్రు లుగాభావించడం గమనించదగిన అంశము. శ్రీనాధునికి పార్వతీదేవి , ఓ వృద్ధ భామినిగా పొడగట్టును,అటులనే గౌర ను గాంచినపుడు, ఆమె తనకు అంచిత మహాకరుణా సంప త్తిగా గోచరమగును.ఆమె చల్లని సౌమ్య దృష్టిప్రసారము,మాధురీ వివేకమూ,వెల్లదనమూ ,నిర్మలినత్వమూ ఆయన దృష్టినాకర్షించినవి.శ్రీనాధకవి సార్వభౌమునికి శిభక్తి ప్రసారానికీ, ప్రచారానికీ--- సమయమూ సందర్భముతోపనిలేదు,
అంటూ సూర్యచంద్రుల శోభనుగూడ శివపారమ్య ప్రబోధకముగానే భావించెను.
కాదుకాదుదయాద్రి కనక కూటంబిది
డంబైన పాన వట్టంబుగాని
కాదు కాదిది సుధాకర పూర్ణబింబంబు
కాశ్మీర శంభులింగంబుగాని
అని చందమామలోనూ శివ సాక్షాత్కారమున్నటుల భావించిన
రసార్ద్ర భక్తి తత్పరుడు కవి సార్వభౌముడు.
పాల్కురికి సోమనాధుడిందుకు భిన్న మైన చిత్తప్రవృత్తిగలవాడు."శివుడే దాత శివుండే భోక్త శివుడేప్రత్యక్ష దైవ"మని నమ్మి, మనసా, వాచా, కర్మణా అదే ఆచరించిన వీర మాహేశ్వరాచార్య ధౌరేయుడు. . శివేతరదైవములను పూజించు వారిపట్ల వైమనస్యమును ప్రదర్శించెను. ఈశ్వరార్చన కళాశీలుడన్న బిరుదు శ్రీనాధ మహాకవిది. శివపారమ్య ప్రబొధకములుగా వెలువడిన శతకములలోవెలలేనిరత్నములుగా నెన్నదగినవి.
పండి రాధ్యుని' శివతత్వ సారము'
యధావాక్కుల అన్నమయ్య విరచిత-'సర్వేశ్వర శతకము.'
ఢూర్జటి కవి దిగా బావించబడిన 'కాళహస్తీ శ్వ ర శతకము.'
కవులు శివునికే సరిపోలిన ప్రశ్నార్ధకములుగా కనుపట్టు సందర్భమున చాటు పద్య రూపముననెన్నో ప్రచారమున గలవు.
సిరిగలవానికిజెల్లును
తరుణులు పడియారువేలు తగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశా గంగవిడుము పార్వతిచాలున్
అని శ్రీనాధుడు దాహార్తితో అల్లాడూన్న ప్రజానీకపు ఇక్కట్లను చూసి,
పరమేశ్వరుని అన వ్యంగ భావ వైచిత్రితో ఎద్దేవచేయడం--ప్రార్ధనాపూర్వకంగా
విన్నవించుకోవడం ఆనాటి సమకాలీన సమాజపు స్తితి గతులను మూల్యాంకనంజేసిన
ఘనాపాఠిగా మనకు గుర్తుకు రాక మానడు.
గరళము మ్రింగితినంచున్
పురహర గర్వించబోకు పో! పో!పో! నీ బిరుదాకంలూడుజుమీ
మెరసెడు రేనాటి జొన్నమెదుకులు దినినన్.
ఆనాటిరోజుల్లో రేనాటిజొన్నలు దిని హరాయించుకొనుట అంత సులభ సాధ్యముగాదని భావన.
"పూర్వమందు విషము పుచ్చుకున్నానని గర్వ పడెదవేళ కాలకంఠ,"
నీ పస , బండారo బయలు పడాలంటే రేనాటిజొన్నన్నము తప్పక తినవలసినదేనని సవాలు.
మన కంటికి నేటికాలమున నల్లులు కనపడు అవకాశములేదుగాని ఒకప్పు డు ఇంటింటా ఇంతింత గాదను విధముగా బాధపెట్టిన ఘనత నల్లులదే. నవారు, నులక మంచాలలో నిలవ వుండి నెత్తురు పీల్చడం గమనించి ఓ కవిపుంగవుడు
ఆ దేవతామూర్తులను వ్యంగ భావ విలసితంగా ఏమంటున్నాడో చూడండి.
శివుడద్రిన శయనించుట
రవిచంద్రులుమింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లిబాధ పడలేకసుమీ!-----
శివుడుని క్షీరాభిషేకములతో, పంచామృతములతో అభిషేకించుట మన సంప్రదాయమేగాని వేరుగాదు.--------------
శివపాదమునుంచనేను శిలనైనను కారాదా
కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా?
----దేవులపల్లి కృష్ణశాస్త్రి.
----శివ శివ,శివ యనియనరాదా ఓరి
భవభయ బాధలనణచుకోరాదా!కామాదుల దెగదోసి
పరభామల,పరులధనముల రోసి
పరమాత్మమునెడబాసి
నీమముతో బిల్వార్చనజేసి. / శివ శివ, //
ఆగమములనుతియించి
తగుబాగులేని భాషల చలించి
భాగవతులతొ పోషించివర
త్యాగరాజ సన్నుతుడనియెంచి--./శివశివ-/-
=========================
ఇతిశివం-
రావెల పురుషోత్తమ రావు.
Nolensville TN
No comments:
Post a Comment