ఇక అస్సలు నడిచే విజ్ఞాన సర్వస్వం దగ్గరకొద్దాం!.యెమ్మెస్సీ జియాలజీ చదివి, అటు ఆధ్యాత్మికంగా జిడ్డు వారివైపు చూపులు పారేసుకుని,యూజీకే గారితో సాన్నిహిత్యం నెరపి చలంగారిదగ్గర ఆధ్యాత్మికతలో కొంత ముందుకడుగులేసి ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అవలోడనంజేసి నవోదయ విద్యాలయాల్లో ప్రధానాచార్యులుగా స్థిరపడి చదువుకునే పిల్లల్లో ఒక తేజోమయ జగత్తును నింపుతూ ఆదర్శమైన జీవనం సాగిస్తూ విజ్ఞాన ఖని గా ఎన్నదగిన వ్యక్తి శ్రీ హనుమంత రెడ్డిగారు! కృష్ణాజిల్లలోని విద్యాలయంలో పనిచేస్తుండగా పరిచయమయారు,, దగ్గర దగ్గర పాతికేళ్ళ స్నేహబంధం మాది. సాహిత్యం మమ్మల్ను సన్నిహితులను జేసింది. ఆపరిమళాలను విద్యార్ధులుగూడా ఆస్వాదించాలన్న దుగ్ధతో "చైతన్య భారతి "అన్న చిన్నపాటి సంస్థను యే ఆర్భాటాలూ లేకుండా స్థాపించి,అక్కడే చిన్నపాటి స్కూలును నడిపే నారాయనరావు గారూ,అవధానిగా అప్పటికే ప్రశంసార్హుడిగా ఉన్న రమణప్రసాద్ల సారధ్యంలో నెలకొక కార్యక్రమం యేర్పాటు చేస్తూ, పిల్లల్లోనూ అక్కడి మిత్రబృందం సహకారంతో పరిమళానను వెదజల్లడం జరిగింది. ఏర్త్ డే జరుపవలసివస్తే మా శాఖతరఫున రెడ్దిగారి ప్రధానోపాన్యాసంతో, జనాల్లో కొంత అవగాహన కల్గించడం జరిగింది.పనిలో పనిగా వారి స్కూల్ లో 'ముచ్చటగా మూడు నిముషాలు' అన్న శీర్షికతో వక్తృత్వపు పోటీలు జరపడమూ జరిగింది. పదుల లు చీటీల్లో నిక్షిప్తంజేసి, ఒక విద్యార్ధిని ఒక చీటీని ఎంచుకుని ఆ విషయాన్ని మూడునిముష్హలపాటు ఆలో చించుకునే అవకా శాన్నిచ్చి తర్వాత మూడు నిమిలపాటు దానిపై మాట్లాడే అవకాశమివ్వడం జరిగింది.ఇది నిజంగా విద్యార్ధులలో ఆసక్తి కలిగించిందని చెప్పడం యేమాత్రం అతిశయోక్తి కాదని మనవి,అలా ప్రరంభమై ఒక ప్రభంజనంలా సాగిన సాహితీ సేవ ఓ సంవత్సరం పాటు జరిగితే ఆ కార్యక్రమాలకు ఓ పావుగంట ముందే ఆ విద్యార్ధులు స్వచ్చాందగా మూడుకిలోమీటర్లు వరుసగా ఉంటూ రవాణా వాహనాల రదీని తట్టుకుంటూ వచ్చి మళ్ళీ కార్యక్రమం అయాక వెళ్ళేవారు అదే క్రమ శిక్షణతో---
మా స్నేహబంధం అలా కొనసాగుతూనే వుంది.అమ్మాయివివాహం నేను హైద్రాబాదులో
ఉద్యోగంచేసే రోజుల్లోవరుడి తల్లిదండ్రుల కోరికమేరకు విశాఖల
చేయవలసి వస్తే నాకు కుడిభుజంగా ఉండేందుకు వీలుగా పదిరోజులపాటు సెలవు పై
మరీ సహకరించిన సౌజన్యం మా రెడ్దిగారిది!!అలాగే నేనే ఊర్లో ఉన్నా ఒక్క సారి
ఒచ్చి రెండ్రోజులయినా మనసు విప్పి మాట్లాడుకోగల స్నేహబంధం ఇది.
అలాగే హైద్రాబాదులో ఒకసారి వారు వస్తే ,నాకోరిక మీద
ఆపెద్ద ప్రాంగణంలో పనిచేసే సాహితీ పిపాసులతో ఒ రెండుగంటలు[దాదాపు 50 మందిపైగా కలిసారు.]
ఆ సందర్భంగానే నాకోరికమేరకు ప్రాచీన కావ్యాల్లో సమకాలీన జీవనం ప్రతిబి0బితం కాలేదన్న
అపప్రధను దూరం చేయాలన్న నా తపనతో "ఆముక్త మాల్యదలో ప్రతిబింబించే సాంఘిక జీవనం'అన్న అంశంపై
రెండుగంటలపాటు సుదీర్ఘంగా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది,ఉపన్యాసమవగానే సభకు చివ్చ్చేసిన వారంతా ఆయన్ను అభినందించడం వారి కళ్ళలో కొత్త విషయాలను తెలుసుకున్నామన్న తృప్తి అవగతమయింది. ఆతర్వాత ఆ ప్రాంగణంలో నేనెప్పుడు కనబడినా కొత్తగా పరిచయమయిన సాహితీ సుగతులంతా మళ్ళీ ఎప్పుడు పెట్టిస్తారు రెడ్దిగారి ఉపన్యాసం ఆయన "ఓ విజ్ఞాన ఖని "అని గౌరవప్రదంగా మాట్లాడడం దం చూశాక
అంకెల సంకెలల్లో అనునిత్యం బందీలయిన ప్రాణాలకు ఓ ఆటవిడుపు లభించినట్లయింది.ఆవిషయంలో అప్పుడు అక్కడ విధులు నిర్వహించిన శర్వశ్రీ కళ్యాణరావుగారికీ,మాధవరావు గారికీ ,దీక్షితులు గారికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
అక్కడనుండి రెడ్డిగారికి కర్ణాటకలోని ఆల్మట్టిదగ్గరున్న స్కూలుకు బదిలీ ఐంది.ఆ సమయంలోనే మా పెద్దవాడికి అక్కడ బాగల్కోట్ ఇంజినీరింగ్ కాలేజీలోబీటెక్ లో సీట్ రావడం ఒక రకంగా అదృష్టమనే చెప్పుకోవాలి.ఆయనే ఆ నాలుగేళ్ళపాటూ వాడికి సమ్రక్షకుడిగా వుండి కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆయన శ్రీమతి ఆదిలక్ష్మి గారుకూ డా ప్రేమాభిమానలతో తమ స్వంత సంతానంలాగానే చూసుకోవడంతో మొట్టమొదటిసారి అమ్మా నాన్నలు వదిలి ఉంటున్నానన్న అనుభూతి ,అనుభవం కలుగలేదు. మేమూ ఒకటి రెండుసార్లు అక్కడకువెళితే ఆయనకు ఇంటా బయటా ఎంత మర్యాద, మన్ననలున్నాయో అర్ధమయింది.

No comments:
Post a Comment