చదువదగిన పుస్తకం
--------------గొపీచంద్ 'యమపాశం'
======================================
సరిగ్గా తొలికధానిక పుట్తిన సంవత్సరంలొనే జన్మించిఉత్తమ కధారచయితగానేగాక
సమాజ జీవితానికి చక్కని దర్పణంలా నవలలు రచించినమంచి ప్రఖ్యాతిని బడసిన వ్యక్తి,
త్రిపురనేని గొపీచంద్.
అసమ్ర్ధుని జీవయాత్ర ,మెరుపులమరకలు,పండిత పరమేశరశాస్త్రి వీలునామా యమపాశంలాంటి నవలలనందించి తెలుగునవలా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన ప్రముఖ రచయిత శ్రీ గొపీచంద్.
ప్రభుత్వ యంత్రాంగమనేది ఒక పరమ పద సోపాన పటం,ఆపటంలో ఎక్కడకక్కడ పాములు పడగలు విప్పి కాటేయడానికి సిద్ధమై బుసలు కొడుతూ వుంటాయి.అలా ఆ పాముల పుట్టలో చిక్కుపడిపోయిన వ్యక్తి.రాజమ్మ భర్త నారాయణరావు.అతనే ఈనవలలోని నాయకుడు.మధ్యతరగతి జీవితంలో మనకెదురయే చేదునిజాలని రచయిత మనకు చవి చూపిస్తాడు.
చాలీ చాలనుఇకొంపలో ఏడుగురు పిల్లలతో ఆ పిల్లలను కనీ కనీ ప్రతిసారీ స్వర్గ ద్వారలదాకా వెళ్ళి దివినుంచి భువికి దిగివచ్చిన జీవచ్చవం లాంటి ఇల్లాలు ఆమె.పైమెట్టుగుండా పకి పోవాలని,పై అధికారుల అండదండలకోసం వారి ప్రాపుకోసం అహర్నిశలూ అర్రులుజాచే చిరుద్యోగులకు అసలు సిసలు ప్రతినిధిగా నారాయనరావు మనకు ద్యోతకమవుతాడు.
కొంతమంది మంచం దగ్గర చెప్పులొదిలితే చాలు భార్య గర్భం ధరించడం ఖాయమని పెరల్ బక్ మాటలకు సోదాహరణంగా నారాయణ రావు కనుపిస్తాడు. ఎపటికప్పుడు సంతానన్ని కంకుండా నిరోధించాలని ప్రయత్నించీ విఫల మౌతుంటాడు. మన కధా నాయకుడు.

No comments:
Post a Comment