Wednesday, June 17, 2015

విప్లవాత్మకమైనభావాలు గలిగి.వివాదాస్పదమైన రచయితగా
విశేష ఖ్యాతినార్జించిన అశేషశేముషీఖని,గుదిపాటి వెంకట చలం. చదువరులనుండి భూషణలు దానికన్న అధికంగా దూషణలనూ గడుసరిగా సమభావంతో స్వీకరించిన ఘటికా వతంసుడూ చలమే.

స్త్ర్ర్ జాతి సముద్ధరణకోసం పురుషుడితో సమానంగా స్త్ర్ర్ని గుర్తించి సమాజం గుర్తించి తదనుగుణంగా గౌరవించాలని సమున్నతంగా ఆశించిన వ్యక్తి శ్రీ చలం.స్త్రీ జతిలోని ఔన్నత్యాన్ని పదె పదే గుర్తుచేస్తూ సమున్నతంగా స్త్రీని శిఖరారోహణం చేయాలని మనసారా భావించి తనరచనలలో
ఉటంకించి త్జ్ర్ప్తి పదిన ఘనాపాఠి.
ఎవరెంతా ఎదురుచెప్ప్పినా ఆక్రోశించినా ,తనరచనలను తన వ్యక్తిగత జీవితాన్ని క్రమానుగుణంగామలచుకున్న విశేషమైన
ప్రజ్ఞాశాలి శ్రీ చలం.ఎందరికో ఆరాధ్యుడిగా నిలవడం ఆయనలోని ప్రత్యేకమైన ప్రతిభకు సోదాహరణం.
1925లో ప్రప్రధమగా వెలువడి ఆతరువాత అసంఖ్యాకమైన మ్య్ద్రణలు నోచుకున్న పుస్తకం--చలం "
స్త్రీ". ఒక నిర్దిష్టమైన దిశగ తనసాహితీ మార్గాన్ని సాగించిన శ్రేయోనిధి.చలం. పుస్తకాన్ని స్త్రీ జాతుఇకి అంకితమిస్తూ

నాకు ఒక్క నిముషం -విశ్రాంతినివ్వక మహాప్రణయ మారుతవేగం అగాధ వియోగ భారంక్రిందనో చీల్చి నలిపి ఊపీఅడనీక నాజీవితాన్ని పాలించే శ్త్రీలోకానికి నివేదితం.
ఈ పుస్తకాన్ని మోహం,పతివ్రత,స్త్రీ నీతి స్రీ సంపాదన బదిచదువులు స్త్రీ స్వేచ్చ ఇలా 38విభాగులా ఈ పుస్తకాన్ని రూపొందించదంజరిగింది.
ఇందులో కుటుంబం సంక్షెమం దృష్ట్యా వెలం వెరిగా అర్రుఇలుజాస్తున్న అమలుజరుపబడుతున్న గర్భ నివృత్తి మార్గాలు-గర్భ స్రావాలూ,బాగ్(ఒగులూ అంటూ కొన్ని అధ్యాయాలను కూదా మనం ఈపుస్తకంలోచూదవచ్చు.
ఈపుస్తకాన్ని ఈనాటికాలలో ఎన్నో నిరసనలు ఎదుర్కొమృటూనే ఎందరో
కొనుగోలుచేయడం ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం ఆస్చర్యాన్ని కలిగిస్తున్నదని చెప్తూ
అంత సీరియస్గానూ విరుద్ధంగానూ రాసిన నాపుస్తకాన్ని ఆప్యాయంగా ప్రజలు చదివి నాకు ఉత్తరాలు రాస్తుమ్నారంటే  తెలుగు ప్రజల మెధోసక్తిమీద జ్ఞాన తృష్ణమీద ఎంతోగౌరవం కలుగవచ్చు.
కానీ నాకొచ్చే ఉత్తరాలు మూడొంతులు గర్భాస్రావానికిమందో,మార్గమోచూపమని ప్రత్యక్షంగానోపరోక్షంగానో నర్మ గర్భంగానో నన్ను అభ్యర్ధించెవె నని విమయాన్ని ప్రకటించారు.

స్త్రీ పురుషానుభవం అమూల్యమనీ ,సెంగారపు విలువల్లో తాను జీఇతాన్నెగాక తక్కిన తన సంబంధమైన జీవితాన్ని సుఖప్రదం చెయాలనే దీక్షవున్న వారికోసమె చ్వ్రాసాను సంటారొకచోట.త్రీ. 

Saturday, June 13, 2015

ఒక ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయునిశ్రీమతిగా
రకరకాలమనస్తత్వ్వాలను అలవర్చుకున్న పిల్లల తల్లిగా
ఎన్నెన్నోఆటుపోట్లనెదుర్కొన్న ఓఅమృతమూర్తిని గూర్చి ప్రస్తావించుకుని
నెలరోజులయినా కాక ముందే ఆ ఆమ్మనుకలుసుకుని పాదాభివందనం చేయాలని వుందని మనవిచేసాను, ఈ శీర్షికలో--ఆమె సహనానికి సోదాహరణమనీ చెప్పుకున్నాను. ఆత్ల్లిని గుర్చితెలుసుకుందామని
నిన్న ఆమె గారి పెద్దకొదుకు ఓ డాక్టర్ మిత్రుడిని అడిగాను అమ్మ గరిని చూదాక్లనిపిస్తుంది  ఎక్కడున్నారు? ఎలాగున్నారు అని ఉత్కంఠావహంగా--- కానీ వచ్చిన ప్తత్యుత్తరం మాత్రం  ఓ కన్నీటి తుఫానును సృష్టించింది.
ఆమె ఈ సంవత్సరం మొదట్లో జనవరి 21 నాడు పరమపదించారని
తెలిసి మ్రాంపడిపోయాను.అదేరోజు ఆమె ప్రాణంకన్నా మిన్నగా
ప్రేమింఛి అనుభూతుల ఆనందాలను పంచుకున్న భర్త గారి పుట్టిన రోజుట.
ఒక జయంతినాడే ఒక వర్ధంతి--విషాదాశ్రువులతో---
=========================================

Saturday, June 6, 2015

చదువదగిన పుస్తకం
--------------గొపీచంద్ 'యమపాశం'
======================================
సరిగ్గా తొలికధానిక పుట్తిన సంవత్సరంలొనే జన్మించిఉత్తమ కధారచయితగానేగాక
సమాజ జీవితానికి చక్కని దర్పణంలా నవలలు రచించినమంచి ప్రఖ్యాతిని బడసిన వ్యక్తి,
 త్రిపురనేని గొపీచంద్.
అసమ్ర్ధుని జీవయాత్ర ,మెరుపులమరకలు,పండిత పరమేశరశాస్త్రి వీలునామా యమపాశంలాంటి నవలలనందించి తెలుగునవలా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన ప్రముఖ రచయిత శ్రీ గొపీచంద్.

ప్రభుత్వ యంత్రాంగమనేది  ఒక పరమ పద సోపాన పటం,ఆపటంలో ఎక్కడకక్కడ పాములు పడగలు విప్పి కాటేయడానికి సిద్ధమై బుసలు కొడుతూ వుంటాయి.అలా ఆ పాముల పుట్టలో చిక్కుపడిపోయిన వ్యక్తి.రాజమ్మ భర్త నారాయణరావు.అతనే ఈనవలలోని నాయకుడు.మధ్యతరగతి జీవితంలో మనకెదురయే చేదునిజాలని రచయిత మనకు చవి చూపిస్తాడు.

చాలీ చాలనుఇకొంపలో ఏడుగురు పిల్లలతో ఆ పిల్లలను కనీ కనీ ప్రతిసారీ స్వర్గ ద్వారలదాకా వెళ్ళి దివినుంచి భువికి దిగివచ్చిన జీవచ్చవం లాంటి ఇల్లాలు ఆమె.పైమెట్టుగుండా పకి పోవాలని,పై అధికారుల అండదండలకోసం వారి ప్రాపుకోసం అహర్నిశలూ అర్రులుజాచే చిరుద్యోగులకు అసలు సిసలు ప్రతినిధిగా నారాయనరావు మనకు ద్యోతకమవుతాడు.
కొంతమంది మంచం దగ్గర చెప్పులొదిలితే చాలు భార్య గర్భం ధరించడం ఖాయమని పెరల్ బక్ మాటలకు సోదాహరణంగా నారాయణ రావు కనుపిస్తాడు. ఎపటికప్పుడు సంతానన్ని కంకుండా నిరోధించాలని ప్రయత్నించీ విఫల మౌతుంటాడు. మన కధా నాయకుడు.

Monday, June 1, 2015

రాసిన ఒకే ఒక  నవలలద్వారా ప్రముఖ రరచయితలలో అగ్రశ్రేణినందుకుని ఆ స్థానాన్ని అనితరసాధ్యంగా పదికాలాలపాటుష్థిరంగా నిలుపుకున్న నవలాకారుడు
కీ.శే/ శివరాజు వెంకటసుబ్బారావు గా,కాక కేవలం బుచ్చిబాబుగా పేర్వడసిన ప్రముఖుడు.

జీవితంలో నిశితమైన పరిశీలనా,సౌంద ర్యo   కలబోసుకున్న మూర్తిమంతమయిన మనీషి మన బుచ్చిబాబు.
చక్కని మనస్తత్వ పరిశీలనకు విశిష్టమైన విశ్లేషణా విన్నాణ్ణానికి స్ఫురద్రూపమైన కిరణంగా  బుచ్చిబాబు మనకు కళ్ళెదుట సాక్షాత్కరిస్తాడు.

ఒకసారి చదవగానే ఇట్టే అర్ధమవకపోగా మళ్ళీ మళ్ళీ చదువుతున్న కొద్దీ మరీ మరీ చదవాలనిపించే సజీవ పాత్రల రూపకల్పనతో  సూదంటురాయిని బోలిన కధనం ఈ నవలేతివృత్తం ,చదువురులను ఇట్టే  కట్టిపడేసేరూపకల్పన ఇందులోమనం గౌరవించదగిన పరిణామం.

ఇందులో కధానాయకుడనదగిన దయానిధి పాత్ర మనకు విచిత్రంగా కనిపిస్తూ పరిశోధన చేయదగిన విషయ వివేచన గలది.తల్లి మీద దయానిధి అవ్యాజానురాగం.అశేషమైన అనురాగం,అద్వితీయమైన్ ప్రేమ.కానీ తల్లి హీనచరితయని గ్రహించాక తల్లిని ద్వేషించకుండా నిబ్బరించుకోలేకపోతాడు.అయినా ప్రత్యక్షంగా ప్రేమ భావాలను ప్రకటించకుండా

ఉండలేకపోతాడు.  కానీ ఆప్రేమలోని బెరుకుతనాన్ని ఎంతకీ సమన్వయంచేసుకోలేక గిల గిలలాడిపోతూ వుంటాడు.తన తల్లిని తన జీవితకాలంలోఎవరు   ఎద్దేవచేసినా,వాళ్ళపై కసినీ పగనూ ద్వేషాన్ని తగ్గించుకోలేక పోతూ సతమతమై పోతాడు.

జెరెసొప్పా జలపాతాలూ ,హిమాలయా పర్వతాలూ,  సింధు భాగీరధీనదులు వీటికిమల్లే తల్లి ఎప్పుడూ తనదగ్గరే ఉండిపోవాలనుకుంటాడు .తల్లికి ఫిట్స్ వచ్చే జబ్బు వుంది.ఆజబ్బును
తను స్వయంగా నయంచేయాలన్న తలంపుతో పట్టుదలతో దీక్షగా
మెడిసిన్ లోచేరి శ్రద్ధగా చదూతాడు. తన చదువు పూర్తయి ఓకొలిక్కి రాకముందే అమ్మను శాశ్వతంగాకోల్పోతాడు.కృంగిపోతాడు.

తరువాత అనాసక్తి అనడంకన్నా అర్ధాసక్తితోవైద్య వృత్తిని రాయలసీమలో కొనసాగించాలని తీర్మానించుకుంటాడు. వైద్యవృత్తిలోసఫలీకృతుడుకాలేక సతమత మవుతూ వుంటాడు.కట్కపోతాడు.జెరెసొప్పా,నయాగరా,సింద్ఘు,భాగీరధీ నదులవోలె అమ్మగూడా
శాశ్వతత్వాన్ని అంతరించుకుంటుందని అంధవిశ్వాసం కలిగివుంటాడు.
తల్లికి ఫిట్స్ వచ్చే జబ్బు వుండెది.తను స్వయంగా డాక్టరై ఆజబ్బును అతి శీఘ్రంగా నయంచేయాలని భావిస్తాడు.
అతని చదువుపూర్తిగాకముందే అమ్మ దూరమతుంది.తన దృష్టానికి తానే వగచి కృంగిపోతాడు.

ఆతర్వాత అర్ధాసక్తితోనే వైద్య వృత్తిని చేయాలని రాయలసీమ ప్రాంతానికి తరలివెళతాడు.అక్కడా మనసును వృత్తిమీద లగ్నంచేయలేకపోతాడు.సఫలీకృతుడుకాలేక బాధపడతాడు.
దయానిధికి ఆ తర్వాత దొరికిన వజ్రం ద్వారా గని యజమాని అవతారమెత్తుతాడు.కార్మికులతో ఘర్షణ ప్రారంభమవుతుంది.ఆసందర్భంగా వాళ్ళు తన వ్యక్తిత్వాన్నీ,అమ్మ గతాన్ని అవహేళనగా మాట్లాడితే మ్రాంపడిపోతాడు.
ఇందిరను వివాహం చేసుకున్నా ఆమెతో సంసార జీవనాన్ని సజావుగా సాగించలేకపోతాడు.తన తల్లిమీద ఇందిర వ్యతిర్క భావాలు ప్రకటించగా అనుమానిచీ, అవమానించీ ఆమెకు దూరంగా మసలుతాడు.

దయానిఢి జీవితాన్ని సంపూర్ణంగా ప్రభావితంజేయగలిగేలా ప్రవర్తించిన స్త్రీ అమృతం. వరుసకు మరదలు వరుస గావడంతో కొద్దిగా చనువు అధికమయిందనే చెప్పుకోవాలి.ఆమెలోని సహజత్వం,చనువు అతనిని విపరీతంగా కట్టిపడేస్తాయి.



తను మనసారా కోరుకున్న మహిళ కోమలి.కానీ ఆమె దయానిధికి అందకుండా దూరం దూరంగా జరిగిపోతుంటుంది.వేశ్యకూతురయినా సుఖాన్ని మరోకరితో పంచుకోని అనాఘ్రాత పుష్పం కోమలి.

తను కోరుకున్న కోమలి తనను తప్పించుకుంటూ తిరుగుతూండడం,ఇందిరతో తనకు శారీరక  సంబంధ మంటేనే వెగటు పుడుతూండడంతో,అతన్ని పూర్తిగా అమృతానికి చేరువగా చేరుస్తుంది.
"పావనివి  అచ్చం  బావపోలికలే గదా"!అని అమృతం వాళ్ళత్తగారితో అంటుండగానే నిగూఢంగానిలిచిపోతుందని దయానిధి భావించిన రహస్యాన్ని  అత్తగారి ఎదుటనే బట్ట బయలు చేస్తుంది..ఇక అమృతం తనకే పరిమితమైపోతుందని భావిస్తాడు.ఆఆశోహతుడౌతాడు.తన ఊహలకు రూపాన్నివ్వాలన్న   తపనను మాను కుని వాస్తవజగత్తులోకి అడుగుపెడతాడు.దయానిధి.

తనకోసం తన ప్రేమకొసం తనను వెదుక్కుంటూ వచ్చిన కోమలిని చేరదీస్తాడు.జబ్బుతో మరణించిన ఇందిర స్థానంలో తన భార్యగా స్వీకరిస్తాడు.


ఇలా దయానిధి పాత్రచుట్టూమిగతా   పాత్రలు పరిభ్రమిస్తాయి.నవలను చదివినకొద్దీ ఆసాంతం ఏకబిగిన చదివించే ప్రజ్ఞఈ నవల ఇతి వృత్తానికి కలదనుట నిస్సందేహముగా యదార్ధము. చదివిన ప్రతి సారీ కొంగ్రొత్త రుచులనందించే చక్కని చిక్కని కధనం.

ప్రతిపదాన్నీ కవితామయంగా రసోదయం కలిగించేలా బుచ్చిబాబు ఎం తో శ్రమకోర్చి తీర్చిదిద్దిన కధనం.
చక్కని ప్రకృతిపరిశీలకునిగా ముచ్చటైన చిత్రకారునిగా మీదుమిక్కిలి మనస్తత్వ శాస్త్ర విశ్లేషకునిగా ఇతివృత్తాన్ని ఎంపిక చేయడం దగ్గరనుంచి, పాత్రలను ప్రతిభాసమన్వితంగా నడిపించేతీరులోనూ ఎన్నో కొత్తదారులను తొక్కిన ఘనత కూడా బుచ్చిబాబుదే.అది వేనోళ్ళా  ప్రశంసార్హం.
తాను సృష్టించుకున్న సమాజంలో మానవుడు ఎలా ఉన్నాడొ విశ్లెషిమడమే నవలాకారుని ప్రధానమైన ఎత్తుగడ.
బాహ్యజగత్తులో ఎదురయే వ్యతిరేక శక్తులతో ఎలాపోరాడాలో ఎలా సమాధానపడాలో  తన అతరంగ జగత్తులో జరిగే గట్టి ఘర్షణను ఎలా సముదాయించాలో సంగ్రంగా మనకు సూచన ప్రాయంగాందించిన మానసిక విశ్ళేషాణాత్మక నవల ఇది.అని బుచ్చిబాబు ఆల్దుక్ష్ హక్సిలీ గురించి రాస్తూ[భారతి-జనవరి-1964 సంచికలో అన్న మాటలు అతని ఈ నవలకు చక్కగా పొదవిన రత్నాల్లా సరిపోతాయి.

తన శక్తినంతా కూడగట్టుకుని ఎంతో మానసిక బలాన్ని ఖర్చుజేస్తూ ఎన్నో సంవత్సరాలు,సాంకేతిక విషయాలను అద్గ్యయనం చేసి వెలువడిన ఈ నవల చదువరి ఏకాగ్రతతో మనసు పెట్తి చదివితేగాని అంతుబట్టని ఒంటబట్టించుకోలేని నవల ఇది. అందుకేనేమో ఇంతగా శ్రమించి రాసిన నవల కావడంతో మరో నవల సృజించకుండానే బహుధా విభిన్న వర్గాల ద్వారా ప్రశంసలనందుకున్న అశఅశేష శేముషీ ఖని , బుచ్చిబాబు అనడంలో సందేహానికి తావులేదు.

Saturday, May 16, 2015

home.comcast.net/~kalanivedanam/monica_teacher.html
===============================================

Monday, May 11, 2015

ఇతిశివం---------రావెలపురుషోత్తమరావు=========================================

తెలుగు సాహితీ నందనోద్యానవనములో అనేక సురభిళమైన కావ్య సుమాలను పూయించిన ఘనత శివకవులదేనని చెప్పుట నిర్వివాదాంశము.ఎన్నోసాహితీ ప్రక్రియలను ప్రవేశపెట్టి సాహితీమతల్లి వైభవమును దశ దిశలా చాటిన ఘనత వారిదే.ముఖ్యముగా శతక వాజ్మయమున తొలి పష్పమును పూయించి తరువాతికాలములో వేనవేలుగా శతకములు భక్తి ర ప్రబోధముగా వెలువడుటకు మార్గదర్శకులైరి. మకుటనియమము,సంఖ్యానియమము శ్రద్ధగా పాటించిన ఘనత వారిదే.

పాల్కురికి సోమనాధుని "వృషాధిప శతకము" తెలుగు నాటవెలిసిన  తొలిశతకము.
బసవే శ్వరుని సంబోధించుచూ బసవా! బసవా!! వృషాధిపా!!!  అన్న మకుటముతో 108 పద్యములతో వెలువరించిన ఘనతసోమనాధునిదే.
ఆతర్వాత శ్రీనాధుని రచనలు ముఖ్యముగాహర విలాసము, కాశీ ఖండము,.భీమ ఖండము,

శివరాత్రి మామాహాత్మ్యమూ    ఎన్నదగినవి.శ్రీనాధునిదృష్టిలో శివపార్వతులు దేవతా స్వరూపం  కన్న మిన్నగా వాగర్ధ ప్రతిపాదకములైన 

తల్లిదండ్రు లుగాభావించడం గమనించదగిన అంశము. శ్రీనాధునికి పార్వతీదేవి , ఓ వృద్ధ  భామినిగా పొడగట్టును,అటులనే గౌర ను గాంచినపుడు, ఆమె తనకు అంచిత మహాకరుణా సంప త్తిగా  గోచరమగును.ఆమె చల్లని  సౌమ్య దృష్టిప్రసారము,మాధురీ వివేకమూ,వెల్లదనమూ ,నిర్మలినత్వమూ ఆయన దృష్టినాకర్షించినవి.శ్రీనాధకవి సార్వభౌమునికి శిభక్తి ప్రసారానికీ, ప్రచారానికీ--- సమయమూ సందర్భముతోపనిలేదు,

అంటూ సూర్యచంద్రుల శోభనుగూడ శివపారమ్య ప్రబోధకముగానే భావించెను.

కాదుకాదుదయాద్రి కనక కూటంబిది

        డంబైన పాన వట్టంబుగాని

కాదు కాదిది సుధాకర పూర్ణబింబంబు

         కాశ్మీర శంభులింగంబుగాని

అని చందమామలోనూ శివ సాక్షాత్కారమున్నటుల భావించిన

రసార్ద్ర భక్తి తత్పరుడు కవి సార్వభౌముడు.

పాల్కురికి సోమనాధుడిందుకు భిన్న మైన చిత్తప్రవృత్తిగలవాడు."శివుడే దాత  శివుండే భోక్త శివుడేప్రత్యక్ష దైవ"మని నమ్మి,  మనసా, వాచా, కర్మణా అదే ఆచరించిన వీర మాహేశ్వరాచార్య ధౌరేయుడు. . శివేతరదైవములను పూజించు వారిపట్ల   వైమనస్యమును ప్రదర్శించెను. ఈశ్వరార్చన కళాశీలుడన్న బిరుదు శ్రీనాధ మహాకవిది. శివపారమ్య  ప్రబొధకములుగా వెలువడిన శతకములలోవెలలేనిరత్నములుగా నెన్నదగినవి.

పండి రాధ్యుని' శివతత్వ సారము'

యధావాక్కుల అన్నమయ్య విరచిత-'సర్వేశ్వర   శతకము.'
ఢూర్జటి కవి దిగా బావించబడిన 'కాళహస్తీ శ్వ ర శతకము.'
కవులు శివునికే  సరిపోలిన ప్రశ్నార్ధకములుగా కనుపట్టు    సందర్భమున  చాటు పద్య రూపముననెన్నో ప్రచారమున గలవు.

 సిరిగలవానికిజెల్లును

   తరుణులు పడియారువేలు తగ పెండ్లాడన్

తిరిపమున కిద్దరాండ్రా

పరమేశా గంగవిడుము పార్వతిచాలున్

అని శ్రీనాధుడు దాహార్తితో అల్లాడూన్న ప్రజానీకపు ఇక్కట్లను చూసి,

పరమేశ్వరుని అన వ్యంగ భావ వైచిత్రితో ఎద్దేవచేయడం--ప్రార్ధనాపూర్వకంగా 

విన్నవించుకోవడం ఆనాటి సమకాలీన సమాజపు స్తితి గతులను మూల్యాంకనంజేసిన

ఘనాపాఠిగా మనకు గుర్తుకు రాక మానడు.

                     గరళము మ్రింగితినంచున్              

               పురహర గర్వించబోకు పో! పో!పో! నీ                                                                 బిరుదాకంలూడుజుమీ                  

          మెరసెడు రేనాటి జొన్నమెదుకులు దినినన్.

ఆనాటిరోజుల్లో రేనాటిజొన్నలు దిని హరాయించుకొనుట అంత సులభ సాధ్యముగాదని భావన.
     "పూర్వమందు విషము పుచ్చుకున్నానని           గర్వ పడెదవేళ కాలకంఠ,"
నీ పస , బండారo బయలు పడాలంటే రేనాటిజొన్నన్నము తప్పక తినవలసినదేనని సవాలు.

 మన కంటికి నేటికాలమున నల్లులు   కనపడు అవకాశములేదుగాని ఒకప్పు డు  ఇంటింటా ఇంతింత గాదను విధముగా బాధపెట్టిన ఘనత నల్లులదే. నవారు, నులక మంచాలలో నిలవ వుండి నెత్తురు పీల్చడం గమనించి ఓ కవిపుంగవుడు

ఆ దేవతామూర్తులను వ్యంగ భావ  విలసితంగా ఏమంటున్నాడో చూడండి.

                 శివుడద్రిన శయనించుట

                రవిచంద్రులుమింటనుంట రాజీవాక్షుం

                డవిరళముగ శేషునిపై

         పవళించుట నల్లిబాధ పడలేకసుమీ!----- 

శివుడుని క్షీరాభిషేకములతో, పంచామృతములతో అభిషేకించుట మన సంప్రదాయమేగాని వేరుగాదు.--------------


శివపాదమునుంచనేను శిలనైనను కారాదా

కైలాసపు స్వామి మరల కలనైనను రారాదా?
----దేవులపల్లి కృష్ణశాస్త్రి.



                  ----శివ శివ,శివ యనియనరాదా ఓరి

             భవభయ బాధలనణచుకోరాదా!కామాదుల దెగదోసి

                               పరభామల,పరులధనముల రోసి

                       పరమాత్మమునెడబాసి

                నీమముతో బిల్వార్చనజేసి. / శివ శివ, //

ఆగమములనుతియించి 

తగుబాగులేని భాషల చలించి

భాగవతులతొ పోషించివర

త్యాగరాజ సన్నుతుడనియెంచి--./శివశివ-/-
=========================

ఇతిశివం-

రావెల పురుషోత్తమ రావు.

   Nolensville TN


Wednesday, May 6, 2015

ఒక్కోసారి సొంత అమ్మలు జీవిoచిలేనివారిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తే,ప్రేమాభిమానాలను
పంచడానికి స్వంత పిల్లలేకానక్కర్లేదని చెప్పగలిగిన వ్యక్తుల్లో మా మహలక్షమ్మ ఆమ్మ[మా పెదనాన్నగారి భార్య] మొదటివరుసలోకొచ్చి కూర్చుంటుంది.తన మరది పిల్లలమైన మమ్ములలను
కడుపులో పెట్టి చూసుకునేది అని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఇప్పటిలా గ్యాస్ స్టౌవ్లూ లేవు
కుక్కర్ల ఊసూ తెలియదు.మాఊహకు తెలిసిందల్లా పొట్టుపొయ్యిలూ, కట్టెలపొయ్యిలూ. బొగ్గులకుంపట్లు కూడా ఇంకా ప్రచారంలోకి రాని రోజులు. వండనలయదు వేవురు వచ్చెనేని అన్నరీతిగా రోజూ
అయిదారుగురు తక్కువకాకుండా [ఇంత్ళో పిల్లలతోసహా ఉన్న పదిమందీకాక] ఉంటుండేవారు.
కర్ణం గారిల్లు కదా యే అదికారిఒచ్చినా ,కులంతో పరిమితంగాకుండా భోజనానికి యేర్పాట్లు జరిగేవి. ఇదిగాక నాలుగు బర్రెల పాడి ఎప్పుడూ రెండు పాడిగానూ రెండు సూడిగానూ ఉంటుండేవి.ఆవులూ ఉండేవి వాటిని మేపుతామని తీసుకెళ్ళిన వాళ్ళు కొండమీద దొర్లిపడ్డాయని చెప్పి అమ్ముకునేవారు,అ0దుకని వాటినిపోషించే వసతిలేక అమ్మేసారు. ఇది గాక పొలంపనులు ఉన్నరోజుల్లో ఒకల్లో ఇఫ్ద్దరికో చద్దిమూఅలాగా అన్నం పంపాల్సి వుండేది. మాపెదనాన్నగారు పోయాక[1985లో]
ఆవిడ మాదగారకొచ్చి గుంటూరులోనే వుండేది. మహ్యాహ్నం రెండుగంటలకు అందరూ తిన్నరనుకున్నాక ఆమె ఎంగిలిపడేది. పూజాపునస్కారాలూ మెండు.ఒంటిగంటదాకా పూజలు చేసుకునేది.
సాయంత్రం ఇరుగుపొరుగూ అమ్మలకాలను కూడదీసుకుని, భారత రామాయణాలు చదివి వినిపించేది.
చదువుకున్నది తక్కువేనయినా సంస్కారం ఎక్కువనిపించేది నాకు ఆమెను చూసినప్పుడల్లా!
ఆవిడచెప్పిన జీవన సూత్రాలు మా ఆవిడకు మంత్రాల్లా పనిజేసి అందరికీ తలలో నాలుకలాగా
ఉండగలిగేందుకు బాగా సాయపడ్డాయి,కన్నవారింటికష్టసుఖాలు కడుపులో దాచుకోవాలి,మెట్టినింటివారి ఇంటివిషయాలు మెదడు దాటిరాకుండా జాగ్రత్త పడాలి.ఇరుగు పొరుగుతో ఎప్పుడూ పొరపాటునగూడా మన ఇంటివిషయాలు పొక్కకూడదు.ముగ్గురుకోడళ్ళలో ఒకరి సంగతి ఇంకొకరితో
చెప్పడం ఆమే నైజానికి విరుద్ధమని తెలుసు.మమ్మల్ను మరిది పిల్లలని ఎప్పుడూ పిలిచేదికాదు,ఇతరులతో అలా అనేదీకాదు.నాపిల్లలే అన్నట్లు మాట్లాడేది. ఆమె మజ్జిగ చిలికుతుంటే అది రొజూ ఓ గంటకార్యక్రమం చుట్టూ చేరితే వెన్నను ముద్దలుగాజేసి పెట్టేది వేది అన్నం మీద మీగడవేసి తినండిరా పెద్ద చదువులకు వెళిటే బలముండాలిగదా! అనేది. ఆమే తమ్ముడు బావ మరది.పెద్ద చదువులు చదివి ఉనెస్చొ లో ఉద్యోగం చేస్తుండేవాడు.రాయబారిగా ఇండియాకు వస్తాడనుకున్న సమయంలో కాలధర్మం చెందాడు. నందిరాజు వాళ్ళు. డిల్లీ స్కూల్ ఒఫ్ ఎకనమిక్స్ లో 50వదశకంలో యెమ్మే చేసాడు,అటువంటి మాతృ మూర్తులను ఈ రోజుల్లో తలుచుకోగలగడం విశేషంకదా!
==========================================================================

Thursday, April 16, 2015

ఆయనపేరు వీరారెడ్డి.స్వతహాగా ఏమీ చదువుకోలేదు.తన సంతానాన్నయినా చదివించి తృప్తిపడదామనుకుంటే నిస్సంతు.అలాగాని మొహం ముడుచుకు కూర్చోలేదు.
ఉన్నతపాఠశాలలో ఒక గది కట్టాలంటే పాతికవేలవుతుంది.[1950-55] లనాటి పరిస్థితి.ఆడబ్బు తనే సమకూరుస్తానన్నాడు.ఆ గదికి ఆయన పేరు పెడతామంటే పేరుకోసంకాదు యేటా పదిమంది పిల్లలకు ఆగది ఆశ్రమయితే అదేచాలునన్నాడు.కానీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టి తమవంతు కృతజ్ఞత
తెలియజేసారు.ఓ బీద కుర్రాడిని మెడిసిన్ లో గుంటూరు వైద్య కళాశాలలో చేర్పించి అతని చదువూ నిరాటంకంగా సాయ పడ్డాదు. ఆకుర్రాడుగూడా మా నాన్ననే పిలుచుకునే వాడు  ఊళ్ళొనే పిల్లనిప్పించి సాయపడ్డాడు.ఎ చే బొ ము [ఎడమచేతి  బొటనవేలి ముద్ర]అయినా ఎందరికో విద్యాగంధం పూసి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు.
డబ్బులిస్తామని కాలేజీకి పేరు పెట్టించుకుని దబ్బులివ్వని మహా వదాన్యులు వున్న మన రాష్ట్రంలో ఇది అమూల్యమైన అత్యంత ఆదర్శప్రాయమైన కాయమే కాదనగలమా. ఆవిద్యార్ధి కంటి వైద్య నిపుణునిగా పేరు బడసినారని చెప్పడానికి సంతోషపడుతున్నాను.ఇదీ మావూరు లోని
==========================================================

Wednesday, April 15, 2015

పనికిరాని కధలు
-------------నవ్వగలిగితే నవ్వండి.
------------------------------
అవి మేము ఉన్నతపాఠశాలలో చదువు వెలగబెడుతున్న రోజులు.
హెడ్మా స్టారంటే   మాంచి సూటూ,బూటూ,హ్యాటూ వేసుకుని హుందాగా
స్కూలుకొచ్చే రోజులు. వాడ్రేవు  సత్య----వారు అలాగే టిప్ టాపుగా
స్కూలుకొచ్చేరోజులవి. ఓ రోజు స్కూల్ పనిమీద గుంటూర్ వెళుతూ[మావూరికీ రైల్ స్టేషన్ ఉన్న మoదపాడుకూ 2 మైళ్ళు నడక దారి తప్పదు. ఊరుమొదటికి రాగానే చెరువుగట్టు.చిరుజల్లులు అప్పటికే పడ్డాయేమో చిత్తడి చిత్తడిగా ఉంది నల్లరేగడినేల.సత్యo గారు జర్రున జారిపడ్డారు. గుడ్డలన్నింటినిండా రేగడి బురద,ఎందుకయినా మంచిదని ఓ జత బట్టలు సిద్ధంగా బుల్లి పె ట్టె  అప్పట్లో తోలు పెట్టెలుండెవి,తేలిగ్గా---] తీసి బట్తలు మార్చుకుని వెళ్ళి తిరిగొచ్చారు.అయితే కధల్లా పెట్టె మోసుకోడానికి తోడుగా వెళ్ళినపాపాయ్[ప్యూను సీతయ్య కొడుకు]--మాకన్న వయసులో బాగా పెద్ద]మాములుగా ఘంట మార్కు బీడీలు[ఈ బీడీలు---ఇవి ఇక్కడ చిక్కును అని కి  కిళ్ళీ   కొట్లముం దు చిన్న బోర్డులుండేవి]తాగేవాడల్లా చార్మినార్ సిగరె ట్టు  తాగుతుంటే పట్టుకుని అడిగితే హెచ్ యం గారు చెరువుగ పట్టు న జారిపడి ఎవరుకీ చెప్పొ   ద్దన అణా ఇ చ్చారు
 అదీ మన జల్సాకు కారణం అదీ  ఆయన బ్రతిమాలి బామాలి చెప్పొద్దన్న ఆ  అతిరహస్యమల్లా బట్టబయలై స్కూలంటికీ నవ్వులు పంచి పెట్టిన కధా కమామిషూ.


----------------------------------------------

Wednesday, April 8, 2015

ఇక అస్సలు నడిచే విజ్ఞాన సర్వస్వం దగ్గరకొద్దాం!.యెమ్మెస్సీ జియాలజీ చదివి, అటు ఆధ్యాత్మికంగా జిడ్డు వారివైపు చూపులు పారేసుకుని,యూజీకే గారితో సాన్నిహిత్యం నెరపి  చలంగారిదగ్గర ఆధ్యాత్మికతలో  కొంత ముందుకడుగులేసి ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అవలోడనంజేసి నవోదయ విద్యాలయాల్లో ప్రధానాచార్యులుగా స్థిరపడి చదువుకునే పిల్లల్లో ఒక తేజోమయ జగత్తును నింపుతూ ఆదర్శమైన జీవనం సాగిస్తూ విజ్ఞాన ఖని గా ఎన్నదగిన వ్యక్తి శ్రీ హనుమంత రెడ్డిగారు! కృష్ణాజిల్లలోని విద్యాలయంలో పనిచేస్తుండగా పరిచయమయారు,, దగ్గర దగ్గర పాతికేళ్ళ స్నేహబంధం మాది. సాహిత్యం మమ్మల్ను సన్నిహితులను జేసింది.  ఆపరిమళాలను విద్యార్ధులుగూడా ఆస్వాదించాలన్న దుగ్ధతో "చైతన్య భారతి "అన్న చిన్నపాటి సంస్థను యే ఆర్భాటాలూ లేకుండా స్థాపించి,అక్కడే చిన్నపాటి స్కూలును నడిపే నారాయనరావు గారూ,అవధానిగా అప్పటికే ప్రశంసార్హుడిగా ఉన్న రమణప్రసాద్ల సారధ్యంలో నెలకొక కార్యక్రమం యేర్పాటు చేస్తూ, పిల్లల్లోనూ అక్కడి మిత్రబృందం సహకారంతో పరిమళానను వెదజల్లడం జరిగింది. ఏర్త్ డే జరుపవలసివస్తే మా శాఖతరఫున రెడ్దిగారి ప్రధానోపాన్యాసంతో, జనాల్లో కొంత అవగాహన కల్గించడం జరిగింది.పనిలో పనిగా వారి స్కూల్ లో 'ముచ్చటగా మూడు నిముషాలు' అన్న శీర్షికతో వక్తృత్వపు పోటీలు జరపడమూ జరిగింది. పదుల   లు చీటీల్లో నిక్షిప్తంజేసి,  ఒక విద్యార్ధిని ఒక చీటీని ఎంచుకుని ఆ విషయాన్ని మూడునిముష్హలపాటు  ఆలో చించుకునే అవకా శాన్నిచ్చి తర్వాత మూడు నిమిలపాటు దానిపై మాట్లాడే అవకాశమివ్వడం జరిగింది.ఇది నిజంగా విద్యార్ధులలో ఆసక్తి కలిగించిందని చెప్పడం యేమాత్రం అతిశయోక్తి కాదని మనవి,అలా ప్రరంభమై ఒక ప్రభంజనంలా సాగిన సాహితీ సేవ ఓ సంవత్సరం పాటు జరిగితే ఆ కార్యక్రమాలకు ఓ పావుగంట ముందే ఆ విద్యార్ధులు స్వచ్చాందగా మూడుకిలోమీటర్లు వరుసగా ఉంటూ రవాణా వాహనాల రదీని తట్టుకుంటూ వచ్చి మళ్ళీ కార్యక్రమం అయాక వెళ్ళేవారు అదే క్రమ శిక్షణతో---


మా స్నేహబంధం అలా కొనసాగుతూనే వుంది.అమ్మాయివివాహం నేను హైద్రాబాదులో
ఉద్యోగంచేసే రోజుల్లోవరుడి తల్లిదండ్రుల కోరికమేరకు విశాఖల
చేయవలసి వస్తే నాకు కుడిభుజంగా ఉండేందుకు వీలుగా పదిరోజులపాటు సెలవు పై
మరీ సహకరించిన సౌజన్యం మా రెడ్దిగారిది!!అలాగే నేనే ఊర్లో ఉన్నా ఒక్క సారి
ఒచ్చి రెండ్రోజులయినా మనసు విప్పి మాట్లాడుకోగల స్నేహబంధం ఇది.

అలాగే హైద్రాబాదులో ఒకసారి వారు వస్తే ,నాకోరిక మీద
 ఆపెద్ద ప్రాంగణంలో పనిచేసే సాహితీ పిపాసులతో ఒ రెండుగంటలు[దాదాపు 50 మందిపైగా కలిసారు.]
ఆ సందర్భంగానే నాకోరికమేరకు ప్రాచీన కావ్యాల్లో సమకాలీన జీవనం ప్రతిబి0బితం కాలేదన్న
 అపప్రధను దూరం చేయాలన్న నా తపనతో  "ఆముక్త మాల్యదలో ప్రతిబింబించే సాంఘిక జీవనం'అన్న అంశంపై

రెండుగంటలపాటు సుదీర్ఘంగా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది,ఉపన్యాసమవగానే సభకు చివ్చ్చేసిన వారంతా ఆయన్ను అభినందించడం వారి కళ్ళలో కొత్త విషయాలను తెలుసుకున్నామన్న తృప్తి అవగతమయింది. ఆతర్వాత ఆ ప్రాంగణంలో నేనెప్పుడు కనబడినా కొత్తగా పరిచయమయిన సాహితీ సుగతులంతా మళ్ళీ ఎప్పుడు పెట్టిస్తారు రెడ్దిగారి ఉపన్యాసం ఆయన "ఓ విజ్ఞాన ఖని "అని గౌరవప్రదంగా మాట్లాడడం దం చూశాక
అంకెల సంకెలల్లో అనునిత్యం బందీలయిన ప్రాణాలకు ఓ ఆటవిడుపు లభించినట్లయింది.ఆవిషయంలో అప్పుడు అక్కడ విధులు నిర్వహించిన శర్వశ్రీ కళ్యాణరావుగారికీ,మాధవరావు గారికీ ,దీక్షితులు గారికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
అక్కడనుండి రెడ్డిగారికి కర్ణాటకలోని ఆల్మట్టిదగ్గరున్న స్కూలుకు బదిలీ ఐంది.ఆ సమయంలోనే మా పెద్దవాడికి అక్కడ బాగల్కోట్ ఇంజినీరింగ్ కాలేజీలోబీటెక్ లో సీట్ రావడం ఒక రకంగా అదృష్టమనే చెప్పుకోవాలి.ఆయనే ఆ నాలుగేళ్ళపాటూ వాడికి సమ్రక్షకుడిగా వుండి కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆయన శ్రీమతి ఆదిలక్ష్మి గారుకూ డా ప్రేమాభిమానలతో తమ స్వంత సంతానంలాగానే చూసుకోవడంతో మొట్టమొదటిసారి అమ్మా నాన్నలు వదిలి ఉంటున్నానన్న అనుభూతి ,అనుభవం కలుగలేదు. మేమూ ఒకటి రెండుసార్లు అక్కడకువెళితే ఆయనకు ఇంటా బయటా ఎంత మర్యాద, మన్ననలున్నాయో అర్ధమయింది.




Thursday, March 12, 2015

ఇది పిచ్చి సుబ్బయ్య కధ
--------------------------
అదే ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగారికన్నాముందుగా  హాజరయే ఓ వ్యక్తి
పూజారి వెళ్ళింతర్వాత మాత్రమే వెళ్ళే వ్యక్తి,పిచ్చి సుబ్బయ్య.
ఎప్పుడూ అదోలోకంలో మాలోకంగా అమాయకంగా వుండే వాడు.
ప్రతిరోజూ గుడికి హాజరయే అంకిత భక్తుడు సుబ్బయ్యే.

ఓ మూల కూర్చుని భజనరోజుల్లో తాళాలుపట్టుకుని ధ్యానమగ్నుడై
వుండే వాడు.మహాయోగిపుంగవుడిలా కనులు మూసుకుని పరధ్యానంలో వుండే వాడు.అది యేదేవుడి ఊరేగింపయినా ముందు వరసలో దేవుడిపటం పట్టుకుని ఇంకోలోకంలో విహరిస్తూన్న అవధూతలా వుండే వాడు.
బేధమల్లా ,అవధూతల్లా అర్ధ నగ్నంగానో అసలు నగ్నంగానో వుండడీ సుబ్బయ్య. ధోతీ[ముతక ఖద్దరు కట్టుకునిపైన కేవలం ఓ తువ్వాలు మాత్రం వేసుకుని తిరుగుతుండే వాడు. రోజూ 9 గంటలనుండీ
వూరిలో ఎవరొకరింటిలో భజనలు నిరంతరం జరుగుతుండే వి.అక్కడా సుబ్బయ్య హాజరయే వాడు. సుబ్బాయ్య అనారోగ్యం పాలయాడని తెలిసిన రోజు ఒక్కటీ కనబడదు. అది నిజంగా యోగమే గదా మరి.
సంసారం పిల్లలూ వున్నారు. అయినా అదో అయోమయం మనిషిలా
భక్తి పారవస్యన్లో తిరుగుతూ వుంటాడు.వేనుగోపాలస్వామి ఊరేగింపులో ముక్కు స్వామి[గరుత్మంతుడి] ప్రక్కగా తనూ నిలుచుని వుండే వాడు. ఇక పుష్య మాసం వచ్చిందంటే నెలరోజుల పాటు
తెల్ల వారుఝామున నలుగురు భక్తులు తాళాలు వాయించుకుంటూ
ఊరు నాలుగు బజార్లూ క్రమం తప్పకుండా తిరిగే వారు. ఆ భజన సమాజంలో
దేవుడి పటం పట్టుకుని ముందు నడవడానికి సుబ్బాయ్యే ఉండె వాడు..
చలీ గిలీ సుబ్బయ్యకు జాంతానై అన్ని ఋతువుల్లోనూ అదే ఆహార్యమే.
ఎవరన్నా ప్రసాదమిస్తే కళ్లకద్దుకునీమరీ తీసుకునే వాడు.
ప్రతిప్రసాదాన్నీ ఇంటికే పట్టుకెళ్ళేవాడు.ఇంట్లో వాళ్ళూ ఆయన ధోరణిని నిరసించినట్లు ఋజువులేవీ లేవు.
సుబ్బయ్య లేని డేవుడిగుడినేఎ,ఊరేగింపునూ  ఎవ్వరూ ఊహించుకోలేరు.ఇక స్రీరామ నవమి పండగొస్తే అది సుబ్బయ్య పండగే.తాటాకు పందిళ్లు వెసే దగ్గరనుంచీ  పండగయాక గుంజలు పీక్కెళ్ళేదాకా సుబ్బయ్యదే
కుశాలంతా.అలాగే హనుమజ్జయంతినాడు సుబ్బయ్య హాజరయి అన్ని కార్యక్రమాలూ నిర్విఘ్నంగా జరగాలని కోరుకునె వాడిలా
పరమ ఉచ్చిలితో హుషారుగా వుండే వాడు.శ్రీరామ నవమి దాటాక మా వూరి లో వసంతం బండి ఊరేగేది.గంగాళం నిండా రంగునీళ్లతో
నలుగురైదు పిల్లలు బండిమీదకెక్కి పిచికారీ జల్లే వారు.ఎవరింటిదగ్గరయినా ప్రసాదం పళ్ళెంలో తెస్తే సుబ్బయ్యే అందుకుని పూజారిగారికిచ్చి కొబ్బరి కాయ కొట్టాక ప్రసాదం
కొబ్బరి చిప్పతో తిరిగి వాళ్ళకందిచే పని మా సుబ్బయ్యదేసుమా!!
===================================================
ఇకనీ గోంగూర కబుర్లును కట్టబెట్టి అసలు విషయంలో కి రమ్మంటున్న చదువరులకు అండగా నిలబడుతూ ఈ వారం-
------------------------------------------
మరపు రాని మనుషులు
అనినేననగానే వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులుగానో
దేశభక్తికి అంకితమైన మహా మనీషులుగా ఊహించుకోకండి.

వీళ్ళు మావూరిలో ఐదు దశాబ్దాలక్రింద అందరినోళ్ళలోనూ
నానిన వారుగనుక ఈ ప్రస్తావన సుమండీ!

మొదటగా పిచ్చి ఆదెమ్మ.
----------------------
మాఉ వుహ తెలిసేటప్పటికే ఆవిడయుక్త వయస్సును దాటి 20 -25 యేండ్ల
మధ్యకు ఒచ్చి వుండొచ్చు.
ఉదయాన్నే ఊరు తెల్లవారకముందే స్నానాన్న పాదాలను ముగించుకుని
బజారులోకి సంచారం మొదలు పెట్టేది. ఒకటో రెండోకుక్కలుగూడా
ఆమె వెంట అంగరక్షణ దార్లుగా వెంటబడి వస్తుండేవి.

ఎవ్వరిదగ్గరా చేయి జాచిన పాపానపోలేదు.మూగతనం ఆమే రూపానికి అధికమౌ ఆభరణం. దంతాల వరుస కొంచం పెద్దగా కనిపించేవి.మూతబడని నోరుతోనే ప్రత్యఖమయేది ఎవరైనా
అన్నం పెడతామంటే తినొచ్చానని సైగలు మాత్రం చేసే ది.

పన్శ్డుగకూ పబ్బాలకూ ఎవరయినా చేసుకున్న అప్పచ్చులిస్తే వాటిని
పరికిణీ కుచ్చెళ్ళలో పెట్తుకుని గబ గబా ఇంటికెల్లి ఇచ్చి వచ్చేది.
ఆదెమ్మకో చెల్లి ఉండేది ఆ అమ్మాయి ఇదే తరహా.తల్లిదండ్రులెవరూ
అదిలించినట్లో వాళ్ళను బెదిరించినట్లో కనబడే దికాదు. ఆ చెల్లి తొందరగానే ఈ ప్రపపంచానికి శాశ్వతంగా సెలవు చెప్పి వెళ్ళి పోయింది. ఆఒక్కరోజున మాత్రం  ఆదెమ్మ కళ్ళల్లో దిగులు కన్నీరు
కనబడిండి. అందరినీ ఓ వెకిలి నవ్వుతోనే ఆప్యాయంగా పలకరిస్తూ
వుండేది. విషేషం ఏమిటటంటే ఆదెమ్మ ఊరంతటికీ శుశకునం.

అరక లు  గట్టే టప్పుడూ యే ఇంట్లో  శు భ కార్యం జరిగినా బొట్టు పెట్తిమరీ ఆదెమ్మకు పసుపూ కుంకుమలందించేవారు. ఆదెమ్మ ఏదయినా
పని మీద వెళ్ళే వారికి ఎదురయితే వారి పని నిర్వ్హిఘ్ణంగా కొనసాగుతుందని జనుల ప్రగాఢ విశ్వాసం. ఆదెమ్మ ఆఖరి శ్వ్వస విద్సిచినరోజున ఊరు ఊరంట మెతుకును ముట్టితే వొట్టు. ఆమెను అంతిమ సంస్కారలకు తీసుకెళ్ళినతరువాతనే ఇళ్ళలో పొయ్యి వెలిగింది.
ఈ ప్రయత్నానికి అప్రయత్నంగా అన్నికులాలవారూ సహకరించడం
కొసమెరుపు. పిచ్చాదెమ్మను పెద్ద ముత్తయిదువుగా గౌరవించిన ఊరును ఎలా మరచిపోగలం చెప్పండి.[సశేషం] నిర్విఘ్నంగా
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇక వరమ్మదగ్గరకెల్దాం

-------------------------------
మావూరిముందరతోపులో ఓ వీరాంజనేయస్వామి వారి  గుడివుంది
మావూరు వారంతా శనివారంవస్తే గుడికి వచ్చి ప్రదక్షిణలుజేసి
మనసారా భగవంతుడినిప్రార్ధించుకుని వెళ్ళే వాళ్ళు.
మనసుకు బాధకలిగినా మనసులో మనసులేకపోయినా
మావూరి   దాక్టర్గారి దగ్గరకెళితే మందులతో పాటు
ఆంజనేయస్వామికి 40 ప్రదక్షిణలు ఓ మండలంపాటు చేయమని సెలవిచ్చే వారు.
 వాళ్ళకు ఆ జబ్బు కుదిరి కుదుట పడేది.
అదంతా ఆ భగవంతుడి దయే నని అనుకునే వారు.అది తప్పని ఎవరూ
భేదాభిప్రాయం వ్యక్తం చేసే వారూ కాదు.ఇక అక్కడ యే శుభకార్యం ఇంట్లో జరిగినా అనుకున్నది జరిగినందుకు 5 కొబ్బరికాయలు కొట్టిమొక్కును తీర్చుకునే వారు. శనివారం నాడు
ఆకుపూజలు జరుగుతూ ఉండేవి. భజనలూ అవీ జరుగుతుండే వి.
తొలకరినాడు పొలంపనులు ఆయన దగ్గరనుంచే ప్రారంభమయేవి.

మూడేళ్ళకో నాలుగెళ్ళకో ఆంజనేయస్వామిని అందంగా అలంకరించే వారు రకరకాల రంగులతో డ్రాయింగ్   మాస్టారు  క్రిష్ణారావు. ఆతర్వాత చిన్నసైజు ప్రభలుగట్టి యాదవ యువకులు గులాము జల్లుకుంటూ కోదె గిత్తలను విగ్రహంచుట్టూ ప్రదక్షిణలు జేయించేవారు. ఈమధ్య వాళ్ళే రoగులు
స్వామివారి విగ్రహానికి  వేయడంకూడ కద్దు.
చాలా సంవర్సరాలపాటు పైకప్పుకూడాలేకుండానే వుండేది.[సుమారు 70 యెళ్ళనాడు,తుర్లపాడునుంచి మావూరికి తరలి వచారని మాత్రం తెలుసు.అక్కడ బావిలో విగ్రహం దొరికిందని అన్ని వూళ్ళ వాళ్ళూ
ఎడ్లబండ్లుగట్టుకుని వెల్లారట. మావూరివాళ్ళూ నలుగురితో నారాయణ అనుకోకుండా భిన్నంగా ఉపవాసముండి, భజన బృందంతో
ఆవూరికి వెళ్ళారట. ఎవ్వరు తీద్దామని ప్రయత్నించినా రాని విగ్రహం మావూరి వారి భజనల ప్రభావమో భక్తి తత్పరతలకు మెచ్చో ముఖ్యంగా పెద్ద డాక్టర్ సుబ్బారావుగారూ, మదీయ తండ్రిసుబ్బారావూగారల కృషీ చిన్న డాక్టర్ కృష్ణమూర్తిగారి కృస్సంకల్ప బలం వుందని వూరంతా గొప్పగా చెప్పుకోవడం మాత్రం విన్నము.
ఇక అసలు విషయానికొస్తే ఈ వరమ్మా ఆ అంజనేయ స్వామికి అనుంగు భక్తుతాలు. శనివారం నాడు ఆ స్వామివారు ఆమే వొంటిమీదకొవ్చ్చే
వారు.అది ఆమె భక్తి కావొచ్చు అధునాతన సాంకేతిక విజ్ఞానం వల్ల మానసిక రుగ్మతా కావొచ్చు. ఆరోజుల్లో మాత్రం అందరూ అది ఆమె ఒంటిమీదకు దేవుడు రావడం శుభ సూచకమేనని భావించే వారు. భవిష్య వాణిలా ఎమీ చెప్పిన దాఖలాల్లేవుగాని ఆ కొద్ది నిమిషాలూ[ఒ 15 నిమిషాలు] మన స్వరంతిలో ఉండేదికాదన్నది మాత్రం వాస్తవం. ఆ తర్వాత అరచేతిలో హారతికర్పూరంబిళ్లలువెలిగించుకునేది. అక్కడె వున్న వేపచెట్టు ఆకులు గుప్పెడు దాకా తింటుండెది. ఎవ్వర్రూ వరసతోపిలిస్తే మాత్రం విపరీతంగా కోప్పడేది. "ఎవరురా నీకు అత్త నేనిప్పుడు సిoహాద్రి వరమ్మను కాదురా వెధవా !!" అని కసురుకునేది. మాచిన్నపుడు ఈ సంఘటనలు అనేకం చూసాం గనుక కించిత్తు భయంతో అసంకల్పితంగా వణుకు పుట్టడం గూడా జరిగేది.

=======================================================
మా హైస్కూల్ కధా కమామిషూ------
----------------------------

ఇక పిచ్చి పిచ్చి కధలు వదిలేసి ఇంకో అంశంలోకి వెల్దాముసారూ
అన్న చదువరుల మనోభావాలకు న్యాయంచేద్దాం
మావూరి హైస్కూలు జిల్లా పరిషత్ దే అయినా చుట్టుప్రక్కల
ఉన్న వాటిలో మాకే  శాశ్వత    ఉండడం విశేషం. మేము జేరాక  యెస్లేసి లో జేరాక ఇంకో రెండు రూములు అదనంగా వచ్చి చేరాయి. పునాది కోసం దాదాపు 20 ఆడుగుల పైగా తీసినట్లు తెలుసు.

ఓ పెద్ద బావిలా పై అధికారులు ప్రత్యక్షంగా పరీక్షించడానికి వస్తే పునాదిని తీసి మరీ చూపించారు. పిల్లలు దాదాపు చుట్టుప్రక్కల ఐదారు వూళ్ళనుంచి వచ్చే వారు.ఉదయాన్నే ప్రేయర్

జరిగేది.మానిటర్లు ఆరోజు హాజరయిన విద్యార్ధుల సంఖ్యను చెబితే యెస్పీయల్[స్కూల్ మొత్తానికీ లీడర్ రాసుకుని హ్.ం.గారికి చెప్పేవారు. వారంలో ఒకరోజు  పిల్లలకు వక్తృత్వ పోటీలు జరిగేవి.
ఆ ప్రాతిపదిక చాలామందికి మున్ముందు వేదికలపై అన్ర్గళంగా
ఉపన్యసించే వీలుగలిగిందనే చెప్పుకోవాలి.
కొన్ని రోజుల ఆరోజు వార్తలను వినిపించే వారు.ఆరోజుల్లో మద్రాసునుంచి దిన పత్రికలు వచ్చేవి. నిన్నటి ది ఇవ్వళ ఒచేది.
=============================

హాజరు
ద్దాం